Friday 4 November 2016

ముంగిస ముఖం.. పాము తోకతో వింత జీవి

చూడటానికి ముంగిసలా ఉంటుంది.. కదిలిస్తే పాములా బుసలు కొడుతుంది. ముందు నుంచి చూస్తే ముంగిస ముఖం.. కింద భాగం అంతా పాములా ఉంటుంది. కదిలిస్తే చాలు మీదకు దూకుతూ భయపెడుతోంది. ఈ వింత ప్రాణి  కర్ణాటకలోని నందిపూర్‌ అడవుల్లో కనిపించింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి జీవిని ఈ అడవుల్లో చూడలేదు అంటున్నారు స్థానికులు. ముంగిస అనుకుని తరిమేందుకు ప్రయత్నించగా అది బుసలు కొడుతూ, మీదకు దూసుకురావడంతో  భయపడి అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ అధికారులు ఆ వింతప్రాణిని బంధించారు. పదునైన పళ్లతో ముంగిస తల, శరీరమంతా పాము తోకలా విచిత్రంగా ఉన్న ఈ ప్రాణిని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఇది ముంగిస జాతికి చెందిన ప్రాణి అయివుంటుందని అభిప్రాయపడ్డారు అటవీ శాఖాధికారులు. ఈ జీవిని గతంలో ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు అటవీ అధికారులు. దీనిపై శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేస్తున్నారు.