Saturday, 29 October 2016

       ఏసుక్రీస్తు స‌మాధి తెరిచారు


ఏసుక్రీస్తు స‌మాధిని కొన్ని శ‌తాబ్దాల త‌ర్వాత తొలిసారిగా ప‌రిశోధ‌కులు క‌ద‌లించారు. క్రీస్తు స‌మాధి చుట్టూ నిర్మించిన చ‌ర్చిని పున‌రుద్ధ‌రించే ప‌నిలో  భాగంగా స‌మాధిపై ఉన్న పాల‌రాతిని చ‌ర్చి మ‌త‌పెద్ద‌ల స‌మ‌క్షంలో ప‌రిశోధ‌కులు జాగ్ర‌త్త‌గా తొల‌గించారు. క్రీ.శ‌. 1555లో స‌మాధిపై ఉంచిన పాల‌రాతిని ఆ త‌ర్వాత ఎన్న‌డూ క‌ద‌లించ‌లేదు.

స‌మాధిపై ఉంచిన పాల‌రాతిని జాగ్ర‌త్త‌గా తొల‌గించామ‌ని దానికింద ఉన్న వ‌స్తువుల‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోయామ‌ని ఫ్రెడ్రిక్ హైబ‌ర్ట్ అనే శాస్త్ర‌వేత్త తెలిపారు. క్రీస్తు పార్థీవ దేహాన్ని ఏ రాయి మీద పెట్టారో శాస్త్రీయంగా విశ్లేషించాల్సి ఉంద‌ని, ఇందుకు కొంత స‌మ‌యం ప‌ట్టొచ్చ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

క్రీస్తు స‌మాధి ఉన్న ప్రాంతం చుట్టూ ఓ చ‌ర్చిని నిర్మించారు. స‌మాధి మ‌ధ్య‌లో ఓ చిన్న కట్టడాన్ని నిర్మించారు. దీన్ని ఎడిక్యూల్ అంటారు. ఓసారి అగ్ని ప్ర‌మాదం సంభ‌వించ‌డంతో 1808,1810 మ‌ధ్య పున‌రుద్ధ‌రించారు.ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇంత‌కాలానికి క్రీస్తు స‌మాధి ద‌గ్గ‌ర చర్చిని రెనోవేట్ చేస్తున్నారు.

క్రెస్త‌వుల విశ్వాసం ప్ర‌కారం క్రీస్తు  30 లేదా 33 సంవత్సరాల్లో స‌మాధి చేశారు.మ‌ర‌ణించిన మూడో రోజున క్రీస్తు పున‌రుత్థానం చెందాడ‌ని క్రెస్త‌వులు విశ్వ‌సిస్తారు. క్రీస్తు మ‌ర‌ణించిన మూడో రోజు త‌ర్వాత  స‌మాధిని నూనెతో అభిషేకం చేద్దామ‌ని ఓ మహిళ వెళ్ల‌గా అక్క‌డ  క్రీస్తుకు సంబంధించిన ఎలాంటి అవ‌శేషాలు ల‌భించ‌లేద‌ని తెలుస్తోంది.

Friday, 28 October 2016

November 2016 15days without SUN

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పేరుతో వచ్చిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ అయ్యింది. దేశాధినేతల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ మాట్లాడుకుంటున్న విషయం. అదేంటనుకుంటున్నారా.. భూమంతా చీకటిమయం కాబోతోంది. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా 15 రోజులు. మొత్తం భూమి.. చిమ్మచీకటి కానుందంట. గ్లోబల్ వైబ్ సైట్స్ కథనం ప్రకారం.. 15 నవంబర్ 2016 నుంచి 30 నవంబర్ 2016 వరకు భూమి చీకట్లోకి వెళుతుందంట. నాసా సైంటిస్టులు ఈ విషయాన్ని చెప్పారంట. ఇప్పటికే అమెరికా దేశాధ్యక్షుడు ఒబామాకు దీనిపై ఏకంగా వెయ్యి పేజీల రిపోర్ట్ ను అందించారంట నాసా హెడ్ చార్లెస్ బోల్డెన్.



నవంబర్ బ్లాక్ అవుట్ గా పిలిచే ఇది.. నవంబర్ 15వ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం 4.15 వరకు ఉంటుందని చెబుతున్నారు. 10 లక్షల ఏళ్లకు ఒక్కసారి ఇలా జరుగుతుందని సైంటిస్టులు తెలుపుతున్నారు.

శుక్రగ్రహం, గురు గ్రహాల మధ్య జరిగే ఖగోళ పరిణామాలతోనే ఇలా భూమి చీకటిమయం అవుతుందని వెబ్ సైట్స్ కథనం. అంతేకాదు నవంబర్ 15వ తేదీ తెల్లవారుజామున 2 గంటల 58 నిమిషాల నుంచి సూర్యుని వెలుతురు కూడా తగ్గుతుందట. బ్లాక్ అవుట్ ఎఫెక్ట్ భూమిపై చూపించనుంది. దీంతో 8 నుంచి 9 డిగ్రీల వరకు టెంపరేచర్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయట.


అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు నాసా సైంటిస్టులు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే.. కొన్ని వెబ్ సైట్స్ గతంలోనూ ఇలాగే ప్రజలను భయాందోళనకు గురిచేసే వార్తలు రావడంతో దీన్ని లైట్ తీసుకుంటున్నారు. సోషల్ మీడియా యూజర్లను మస్కా కొట్టడంలో వాటికవే దిట్ట అంటున్నారు. ఈ వార్త వాట్సప్, ఫేస్ బుక్ ల్లో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. అయితే.. ఇలా భూమి చీకటవుతుందనే వార్తలు కమ్మశక్యంగా లేవంటున్నారు కొందరు సైంటిస్టులు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. నాసా పేరుతో.. వాళ్ల ఫొటోలతోనే ఈ వార్త సోషల్ మీడియాలో సర్క్యులర్ అవుతుంది. భూమి మొత్తం చీకట్లు కాకపోయినా.. టెంపరేచర్ మాత్రం పెరిగే అవకాశం ఉందని మరికొన్ని వెబ్ సైట్లు కోడైకూస్తున్నాయి.