Saturday, 29 October 2016

       ఏసుక్రీస్తు స‌మాధి తెరిచారు


ఏసుక్రీస్తు స‌మాధిని కొన్ని శ‌తాబ్దాల త‌ర్వాత తొలిసారిగా ప‌రిశోధ‌కులు క‌ద‌లించారు. క్రీస్తు స‌మాధి చుట్టూ నిర్మించిన చ‌ర్చిని పున‌రుద్ధ‌రించే ప‌నిలో  భాగంగా స‌మాధిపై ఉన్న పాల‌రాతిని చ‌ర్చి మ‌త‌పెద్ద‌ల స‌మ‌క్షంలో ప‌రిశోధ‌కులు జాగ్ర‌త్త‌గా తొల‌గించారు. క్రీ.శ‌. 1555లో స‌మాధిపై ఉంచిన పాల‌రాతిని ఆ త‌ర్వాత ఎన్న‌డూ క‌ద‌లించ‌లేదు.

స‌మాధిపై ఉంచిన పాల‌రాతిని జాగ్ర‌త్త‌గా తొల‌గించామ‌ని దానికింద ఉన్న వ‌స్తువుల‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోయామ‌ని ఫ్రెడ్రిక్ హైబ‌ర్ట్ అనే శాస్త్ర‌వేత్త తెలిపారు. క్రీస్తు పార్థీవ దేహాన్ని ఏ రాయి మీద పెట్టారో శాస్త్రీయంగా విశ్లేషించాల్సి ఉంద‌ని, ఇందుకు కొంత స‌మ‌యం ప‌ట్టొచ్చ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

క్రీస్తు స‌మాధి ఉన్న ప్రాంతం చుట్టూ ఓ చ‌ర్చిని నిర్మించారు. స‌మాధి మ‌ధ్య‌లో ఓ చిన్న కట్టడాన్ని నిర్మించారు. దీన్ని ఎడిక్యూల్ అంటారు. ఓసారి అగ్ని ప్ర‌మాదం సంభ‌వించ‌డంతో 1808,1810 మ‌ధ్య పున‌రుద్ధ‌రించారు.ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇంత‌కాలానికి క్రీస్తు స‌మాధి ద‌గ్గ‌ర చర్చిని రెనోవేట్ చేస్తున్నారు.

క్రెస్త‌వుల విశ్వాసం ప్ర‌కారం క్రీస్తు  30 లేదా 33 సంవత్సరాల్లో స‌మాధి చేశారు.మ‌ర‌ణించిన మూడో రోజున క్రీస్తు పున‌రుత్థానం చెందాడ‌ని క్రెస్త‌వులు విశ్వ‌సిస్తారు. క్రీస్తు మ‌ర‌ణించిన మూడో రోజు త‌ర్వాత  స‌మాధిని నూనెతో అభిషేకం చేద్దామ‌ని ఓ మహిళ వెళ్ల‌గా అక్క‌డ  క్రీస్తుకు సంబంధించిన ఎలాంటి అవ‌శేషాలు ల‌భించ‌లేద‌ని తెలుస్తోంది.

No comments:

Post a Comment